ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ముగ్గురు భారత బాక్సర్లు సెమీస్ కు చేరారు. వేర్వేరు విభాగాల్లో జరిగిన క్వార్టర్ బౌట్లలో మహమ్మద్ హుసాముద్దీన్(57 కిలోలు), దీపక్ భోరియా(51 కిలోలు), నిశాంత్ దేవ్(71 కిలోలు) విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మూడు పథకాలు ఖాయమయ్యాయి. 2019 టోర్నీలో భారత్ రెండు పథకాలు సాధించిన విషయం తెలిసిందే.