కొన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్ రాకుండా నివారిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. బ్రోకలీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని దీన్ని తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, బెర్రీస్ లోని విటమిన్స్, ప్లవనాయిడ్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని అంటున్నారు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, టమాటా వంటివి తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తప్పించవచ్చని స్పష్టం చేస్తున్నారు.