చర్మం మెరిసిపోవాలంటే బియ్యప్పిండి, బాదం పొడి, శనగపిండిల్లో ఏదో ఒకదాన్ని టేబుల్ స్పూను తీసుకోవాలి. దానికి చెంచా చొప్పున పాలపొడి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి 5 నిమిషాలపాటు రుద్దాలి. ఆ తర్వాత టమాటా లేదా బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసుకోవాలి. అది ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి సహజ మెరుపు వస్తుంది. ఒకవేళ మొటిమలతో ఇబ్బంది పడుతున్నట్లైతే వేప పొడిలో గులాబీ నీటిని కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత తుడిచేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.