సొరకాయ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సొరకాయలో విటమిన్ సి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సొరకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సొరకాయలోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది. సొరకాయ తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. సొరకాయ అతి దాహం తగ్గిస్తుంది. నిస్సత్తువను పోగొడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.