ఆర్థిక మాద్యం సాకుతో ఇటీవల పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వాటి జాబితాలో తాజాగా రిలయన్స్ జియో మార్ట్ కూడా చేరింది. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన జియో మార్ట్ 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. రానున్న వారాల్లో మరో 9,900 మంది ఉద్యోగులకు కూడా లేఆఫ్స్ ప్రకటించనుంది. కార్పొరేట్ ఆఫీస్లో 500 మందిని, క్షేత్రస్థాయిలో మరో 500 మందిని రాజీనామా చేయాలని జియో మార్ట్ కోరినట్టు తెలిసింది.