రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిందే. అయితే, కొందరు యాపిల్ తో పాటు గింజలనూ తింటుంటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో తేలినట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష సమ్మేళనం వల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుందని అంటున్నారు. దీంతో తలనొప్పి, అలసట, నీరసం తదితర సమస్యలు వస్తాయి. అందువల్ల ఎక్కువగా వీటిని తీసుకోకూడదు.