ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 17–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అంగద్బీర్ సింగ్ మూడు గోల్స్ చేశాడు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.