అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఒక వేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ మొత్తానికి అంతరాయం కలిగితే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అంటే ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!