దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 62,801 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,603 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.58 వద్ద ప్రారంభమైంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.