వ్యాధులను దూరం చేయడానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోజూ అర టీ స్పూన్ పసుపు పొడిని వేడి పాలలో కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్నానానికి ముందు కొన్ని చుక్కల నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ముక్కు రంధ్రంలో వేస్తే ఇన్ఫెక్షన్ నివారించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలతో తయారు చేసిన టీ తాగినా ఇమ్యూనిటీ పెరుగుతుందంటున్నారు.