వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా తుది జట్టు ఎంపిక తీరుపై మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఫైర్ అయ్యారు. తుది జట్టులో అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్త పరిచారు. అత్యుత్తమ స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌తో సంబంధం లేదన్నారు. అశ్విన్ డబ్ల్యూటీసీ టోర్నీలో 13 టెస్టుల్లో 61 వికెట్లు తీశాడని గుర్తు చేసుకున్నారు. ఈ కామెంట్లకు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ.. స్పీడ్ బౌలింగ్‌కు ఓవల్ పిచ్ అనుకూలంగా ఉంటుందని, అందుకే అదనంగా నాలుగో బౌలర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.