తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్న ప్రణయ్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో తలపడనున్నాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్, మాళవిక బన్సాద్, ఆకర్షి కశ్యప్, రుత్విక శివాని ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్, మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-రోహన్ కపూర్ పోటీ పడనున్నారు.