హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ అదిరిపోయే శుభవార్తను తెలిపింది. రూ. లక్ష డిపాజిట్ చేస్తే ఇంకో రూ.లక్ష పొందొచ్చు. అది ఎలా అంటారా? ఎస్‌బీఐ ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ అందిస్తోంది. లక్షకు రూ.6,400 వడ్డీ వస్తుంది. అదే మూడేళ్ల టెన్యూర్‌పై 7 శాతం వడ్డీకి రూ.23 వేలకుపైగా వడ్డీ వస్తుంది. పదేళ్ల టెన్యూర్‌కు రూ.లక్ష 10 వేలు వడ్డీ పొందవచ్చు. అదే హెచ్‌డీఎఫ్‌సీలో ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే రూ.7,300 వడ్డీ పొందవచ్చు. పదేళ్ల టెన్యూర్ అయితే 7.75 శాతం వడ్డీతో రూ.1.15 లక్షలు పొందవచ్చు.