1) మేష రాశి: ప్రారంభంలోనూతన రుణములను కొంత చెల్లిస్తారు. రావలసిన బకాయిలు అందుకుంటారు.కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ మిత్రులతో మాట్లాడతారు. వ్యక్తిగత గౌరవము శ్రద్ధ పెరుగుతాయి. వృత్తిలో అధికారుల తో ముఖ్య అంశములు చర్చిస్తారు.బంధువులతో మాటలలొ అపార్ధములు రాకుండా జాగర్త గ ఆలోచించి మాట్లాడాలి. వృత్తిపర అభివృద్ధి అంశములు కొరకు విదేశీ అవకాశములకొరకు విద్యార్థులు ప్రయత్నిస్తారు. వారము మధ్యలో విద్య సంబంధ అంశములకొ రకు ఎలక్ట్రానిక్ వస్తువులకకొరకు ఖర్చులు అధికము.పరక్రమము పెరుగుతుంది.ప్రయాణములు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయము.వృత్తి రీత్యా అధికారములొ ఉండే వ్యక్తుల సహకారము అందుకుంటారు. వారము చివరిలో వాగ్వాదములకి అనవసర ఖర్చులకి దూరము ఉండాలి. అధిక జోక్యముతో వ్యక్తులు ఇబ్బంది పెడతారు.తీర్ధ యాత్రలకి ప్రణాళికలు వేసుకుంటారు.సంఘసేవచేస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు.సాయిబాబా దేవాలయ సందర్శన, గురు చరిత్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది.
2)వృషభరాశి: ఆత్మీయులతోభూ,గృహమునకుసంబంధించికొత్తవిషయాలు ఆలోచించి చర్చిస్తారు.నూతన వస్తు వస్త్ర లాభములు ఉంటాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. శుభ కార్యక్రమములలో బంధు కార్యక్రమాల్లోపాల్గొంటారు. ఆత్మీయులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు.మంచి ఆలోచనలతో ప్రణాళికలతో వారం ప్రారంభిస్తారు.సంఘంలో మీకు తగిన గుర్తింపు మరియు గౌరవం పెరుగుతాయి. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతుంది. ఇష్టమైన వారి కోసం ఖర్చు అధికంగా చేస్తారు.టూరిజం, జర్నలిజం రంగంలో ఉండే వారికి, రచయితలకు సమయం అనుకూలముగా ఉంటుంది. ఆదాయము అభివృద్ధి పథంలోకి నెమ్మదిగా వెడుతుంది. వృత్తిపరమైన ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి చాలాకాలము గా ఆగుతూ వస్తున్న వృత్తికిసంబంధ ప్రభుత్వపరమైన పనులు ముందుకు వెళతాయి.వారము చివరిలోఆరోగ్యం,విశ్రాంతిఆహారముపై శ్రద్ధ వహించాలి.బంధుమిత్రులతోసమస్య రాకుండా మౌనముగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.నవగ్రహ దేవాలయ సందర్శన, ప్రదక్షిణలు మంచి ఫలితాన్ని ఇస్తుంది
3) మిధున రాశి: వారం ప్రారంభంలోభాతృ వర్గంతో, ప్రక్క వారితో మాట్లాడేటప్పుడు సున్నితంగా మాట్లాడాలి. వివాదములకు, నూతన వ్యక్తుల తో ఆలోచించి మాట్లాడాలి. గృహములోని వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. వాహనములు నడిపేటప్పుడు వాహనములకు ఇబ్బంది లేకుండా, ప్రయాణము చేయు సమయంలో అసౌకర్యములకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. వారం మధ్యలో ముఖ్యంగా వృత్తి లో అధికారం పెరుగుతుంది. ధైర్య సాహస పరాక్రమం పెరుగుతుంది వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది,బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి అధికారము, ఆశించిన స్థలాలకి అనుకూలము. వివిధ పోటీ పరీక్షలలో గట్టిగా శ్రమిస్తారు. వృత్తిపరంగా చక్కని వార్త మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయము పెరుగుతుంది. మానేజ్మెట్ ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమైన సమయము. విద్యార్థులకు అనుకూలమైన సమయము. న్యాయపరమైన అంశములలోకొంతమేరా అనుకూలత. వారంతములో.విదేశీ ఆహ్వానములు, బంధు మిత్రుల కలయిక. వ్యాపార భాగస్వామి తో కొత్త ప్రణాళికలు చర్చలు. నరసింహస్వామి ఆలయ సందర్శనం, స్తోత్ర పారాయణ మేలు.
4) కర్కాటక రాశి: ఖరీదైన ఆభరణ, భు,వాహనాలు కొనుగోలుకై ఖర్చులు అధికముగా ఉంటాయి. తగిన విధముగా ఆదాయము కొంతవరకు బాగుంటుంది.నూతన నిర్ణయాలు, ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.చిన్న నాటి మిత్రుల కలుస్తారు, వారి సలహాలు ఆశీస్సులు లాభదాయకంగా ఉంటుంది.ఆత్మీయ మిత్రులతో పాటు తోబుట్టువులు సకాలములో స్పందించి సహకరిస్తారు. కుటుంబంలోని సంతానం సంబంధ ఒక ముఖ్య అంశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వారు మీ నిర్ణయాలని గౌరవిస్తారు.వాహన గృహ మార్పులకి ఆలోచనలు. విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ ఆసక్తి చూపించాలి. దూర ప్రదేశంలో విద్యార్థులకు హాస్టల్ వంటి వసతికి అవకాశములు లభ్యము. స్థిరస్తుల పెట్టుబడికి యోచన. తల్లి సహకారము, ఆరోగ్యము బాగుంటుంది. వ్యవసాయము అభివృద్ధి. . వారము చివరిలోఉపాసన బలము పెరుగుతుంది. ఆధ్యాత్మికమైన ప్రదేశములు సందర్శన.వృత్తిలో ఆ కస్మికంగా అనుకొని అభివృద్ధి ఆనందాన్నిస్తుంది, సహకరించే వ్యక్తులను కలుసుకుంటారు.* దత్తాత్రేయ స్వామి మందిరాలు దర్శనం, దత్త నామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
5) సింహరాశి: ప్రారంభంలో భాగస్వామితోనూ,అధికారులైన స్త్రీలతో వినయ విధేయతలతో ప్రవర్తించి మాటల వలన అపార్ధములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.వృత్తి పరమైన ఆదాయం అభివృద్ధి కరంగా ఉంటుంది. బంధు వర్గము రాక సందడి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిఉంటుంది. వారము మధ్యలో కుటుంబ సభ్యుల ఆరోగ్యము కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు . టాక్స్ చెల్లి స్తారు మరియు విద్య సంబంధ అంశాలకు ఖర్చులు.రాజకీయ నాయకులతో, అధికారులతో చర్చలు. పౌరుషముగా నిర్ణయాలు తగవు. వృత్తిపర అసంతృప్తి వారంతములో అధిగమిస్తారు.సంతానమునకు సంబంధించిన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి.సహకరించే మిత్రుల వలన వృత్తిపరమైన విషయములలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు,దగ్గరప్రయాణాలుఉపయోగకరముగా ఉంటాయి.మనసు ప్రశాంతతకు యోగ ధ్యానము సహకరిస్తాయి .ఉల్లాసముగా మిత్రులతో ఆత్మీయులతో గడుపుతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది .
సూర్య నమస్కారములు, మెడిటేషన్ మంచిఫలితాన్నిఇస్తాయి.
6) కన్యారాశి: వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో, చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు.మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ పరమైన ఒక విషయంలో వార్త ఆశజనకముగా ఉంటుంది. కళత్రమునకు ఆదాయము అభివృద్ధి కరంగా ఉంటుంది. న్యాయపరమైన అంశముల నిమిత్తము న్యాయ వాదులతో చర్చిస్తారు.ఆకస్మిక అవకాశములు, గుర్తింపు గౌరవము అధికంగా ఉంటుంది.వారు, బ్యాంకు ,ఐ టి రంగంలో వారి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ అవకాశముల కొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలము.వారము మధ్యలో పిత్ర అర్జీత సంబంధ గృహ, భు అంశాల్లో కొంత మానసిక అశాంతిగా ఉంటుంది. తోబుట్టువులయిన స్త్రీలతోఅభిప్రాయాబేధములు,అపార్ధములు . వారం చివరిలోసోదరులు, సేవకులు సహకరిస్తారు. దగ్గర ప్రయాణములు చేస్తారు.దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేయు విద్యార్థులకు కొంతవరకు శ్రమ ఎక్కువగా చేయవలసి ఉంటుంది. దగ్గరలో ఉంటే సత్యనారాయణ స్వామి మందిరములుదర్శించుటవలన, శ్లోకములు పారాయణ చేయుట వలన మంచి ఫలితాలు లభిస్తాయి.
7) తులారాశి: వారం ప్రారంభంలోవృత్తి పరంగా బాధ్యతలు శ్రమ అధికంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. సంతానమునకు విదేశీ విద్య విదేశీ ఉద్యోగ అవకాశములు. తోబుట్టువులతో చర్చించి మనసుని ప్రశాంత పరచుకుంటారు .దూర ప్రదేశంలో నుంచి మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు. మనసు ప్రశాంతతకి చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. వారం మధ్యలో కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటారు. ఎదురుచూస్తున్న ఒక విషయం కొంత ఉత్తేజాన్ని నింపుతుంది ఆకస్మికంగా ఊహించని రీతిలో ఆదాయమునకు మించిన ఖర్చులు, కానీ అవి ఉపయోగకారిగా ఉంటాయి. వారాంతములో ఆరోగ్య విషయంలో, విశ్రాంతి, తగిన ఆహార స్వీకరణ, అవసరము. శరీరమునకు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వలన బడలిక అనారోగ్య భావనలు. విందు వినోదముల కొరకు, ఇష్టమైన వస్తు సామాగ్రి కొనుగోలు కొరకు అధికముగా ఖర్చు చేస్తారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడులకే ఆలోచనలు చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలుసందర్శించుట, అష్టోత్తర శతనామావళి వినుట కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
8) వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ప్రారంభంలో భాగస్వామికి సంబంధించిన వృత్తి, ఆదాయపరమైన అంశాలలో అభివృద్ధి , వారి వృత్తి నిమిత్తం ఎదురుచూస్తున్న ఒక వార్త ఓ కొలిక్కి వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, చర్చలు కొంత ముందుకు పెడతాయి. నూతన పెట్టుబడులకు, ఆభరణ కొనుగోలు కొరకు ప్రయత్నములు చేస్తారు. వారము మధ్యలో ఆదాయం పెరుగుతుంది, రుణములు చెల్లిస్తారు. బంధువుల రాక. కుటుంబ వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది సంతానమునకు అభివృద్ధి కరంగా ఉంటుంది, విద్యార్థులకు ఆశించిన ప్రదేశములలో సీటు లభ్యం. క్రీడాకారులు గుర్తింపు గౌరవం విషయంలో అధిక శ్రమ చేస్తారు. వారం చివరిలో అతివిశ్వాసముతో వ్యవహరిస్తూ, అధికారులతో ఆకస్మిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించవలెను .సంతానం విద్యా నిమిత్తము ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకై అధికముగా ఖర్చులు చేస్తారు.మెడికల్, కంప్యూటర్ రంగాలలో వారికి అనుకూలమైన సమయం. ఖర్చులు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతనం పనికిరాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నేశ్వర దేవాలయంలో సందర్శించుట, గణేష్ నామాలు జపించుట మంచి ఫలితాలను ఇస్తుంది.
9) ధనస్సు రాశి: రుణములు చెల్లిస్తారు కొత్త రుణములకై ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. న్యాయ విషయములకై పెద్దవారిని సంప్రదిస్తారు. శత్రువులను మీ కృషిశీలతతో అధిగమించి ఆశించిన ప్రయోజనాలను సాధించగలుగుతారు. వృత్తిలో పోటీ తత్వం పెరుగుతుంది అధిక శ్రమ బాధ్యతలతో వారం ప్రారంభమవుతుంది పోటీ పరీక్షల్లో విజయము గుర్తింపు కొరకే అధికంగా శ్రమిస్తారు. భూ సంబంధ స్థిరాస్తి విషయములలో కొన్ని నిర్ణయములు తీసుకుంటారు. ముఖ్యమైన విషయములు చర్చించేటప్పుడు ఇతరులతో అపార్థములు రాకుండా వాగ్వాదములకు లోను కాకుండా ఆచితూచి వ్యవహరించవలెను. త్వరగా ఉద్వేగములకు గురి అవుతారు.వారము చివరిలోజీవిత భాగస్వామికి వృత్తిపరముగా నూతన అవకాశములు,ప్రభుత్వ పరమైన విషయములలో కొంతవరకు మీకు ఆశాజనకముగా ఉంటుంది. శ్రీకృష్ణ మందిరములు దర్శించుట, కొంత ప్రసాద వితరణ మంచి ఫలితములను ఇస్తుంది.
10) మకర రాశి: వారం ప్రారంభంలో పౌరుషంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కొన్నిసార్లు మీ నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా ఉంటాయి. సంఘ సేవ చేస్తారు, పడిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.సంతానమునకు అభివృద్ధి కరంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నం చేయువారికి కొంతమేర అనుకూలత. తోబుట్టువులు మిత్రులు సహకారంతో విద్యా ఉద్యోగపరమైన కొత్త ప్రణాళికలు.విద్యార్థులకు విద్యాపరంగా ఉన్నత విద్యలో అభివృద్ధి నూతన అవకాశములు దూర ప్రదేశములలో హాస్టలు వసతి. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల సహకారము. వారం మధ్యలో ఉపాసన బలం పెరుగుతుంది మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక ప్రదేశాలు దర్శిస్తారు. ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆత్మీయ వ్యక్తుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది వారం చివరిలోశ్రమ బడలిక పెరుగుతుంది. అనవసర ఖర్చు అధికముగా చేస్తారు. సమయానికి శారీరక శ్రద్ధ అవసరము. విష్ణు మూర్తి దేవాలయం సందర్శన, విష్ణు సహస్రనామం వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
11) కుంభరాశి: వారం ప్రారంభంలో ఆరోగ్యం విషయంలో సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి మంచిది. గృహనిర్మాణం, స్థిరస్తుల విషయాల్లో, వ్యవసాయ సంబంధ భూ అంశాలలో మొదలైన కొనుగోలు అంశాలలో భాగస్వామితో చర్చలు, ఆత్మీయుల సహకారాన్ని ఆశిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.బంధువులతో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి.మరియు ప్రయాణము విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆత్మీయులతో ఆకస్మిక అపార్ధములు ఆస్కారముంది. వారము మధ్యలోవృత్తిపరమైన బడలిక శ్రమ అధికమవుతాయి. చాలా కాలంగా ఆగిన రుణములను ముఖ్యమైన వారి సహకారంతో చెల్లిస్తారు. వారం చివరిలోవిదేశాల్లో ఉన్న ఆత్మీయుల సహకారంతో కొనుగోలు వ్యవహారాలలో ముందుకు వెళతారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయంతీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన, అష్టోత్తరాలు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
12) మీన రాశి: కమ్యూనికేషన్ రంగంలో ఉండే వారికి కొత్త అవకాశములు.వ్యాపారంలో భాగస్వాములతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. జీవిత భాగ స్వామికి కళా రంగములో గుర్తింపు. వృత్తి పరమైన ప్రయాణాలకు సిద్ధమవుతారు. నూతన రుణములు కొరకు ప్రయత్నాలు చేస్తారు. సమయస్ఫూర్తిగా పనులను చక్కబెట్టుకుంటారు. వారము మధ్యలో నూతన కొనుగోళ్లు, నిర్ణయాలు తీసుకునే సందర్భాలలో తొందర పడకుండా ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళ్లడం మేలు. ఆకస్మిక ఖర్చులు ఆందోళనను కలిగిస్తాయి.సంతానమునకు విద్యాపరమైన అభివృద్ధి, ఆవకాశములనుఅందుకుంటారు.చమత్కారంగా మాట్లాడి అందరిని ఆకట్టు కొని అనుకున్న పనులను సాధించుకుంటారు. వారము చివరిలో అధిక శ్రమ ,గుర్తింపు గౌరవం పెరుగుతుంది. మీ సహకారాన్ని కోరి మిమ్మల్ని సంప్రదించిన వారికి కాదు అనకుండా సహాయాన్ని అందిస్తారు.అమ్మవారి దేవాలయ సందర్శన, కుంకుమ పూజ, మంచి ఫలితాన్ని ఇస్తున్ది.
*****గమనిక: వ్యక్తిగత జాతకము (అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ) ప్రకారము వ్యక్తి కి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు.
డా|| ఈడుపుగంటి పద్మజారాణి
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు
email : padma.suryapaper@gmail.com
phone : +91 9393 00 7560, +91 98492 50852