దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంతో 63, 026 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 18, 682 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81. 97 వద్ద ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.