వైఎస్సార్ లా నేస్తం పథకం నిధులను నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2, 677 మంది యువ లాయర్ల ఖాతాల్లో నెలకు రూ. 5 వేల స్టైఫండ్ విడుదలలో భాగంగాతొలివిడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి జూన్ వరకు రూ. 25 వేల చొప్పున అందజేస్తారు. కాగా, కొత్తగా లా కోర్సు పూర్తిచేసిన వారు నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఏటా రూ. 60 వేల చొప్పున మూడేళ్లు సాయం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa