పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న షిర్డి సాయి మందిరంలో సోమవారం గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తెల్లవారుజామునండి కాగడా హారతులతో ప్రారంభించి ఉత్సవమూర్తి స్వామి వారికి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని క్షీరాభిషేకాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.