బీసీసీఐ సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్గా భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా అగార్కర్ పేరును సూచించినట్లు బోర్డు కార్యదర్శి జైషా తెలిపారు. అగార్కర్ ఇప్పటివరకు 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడారు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ప్యానల్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడు అగార్కర్ కావడంతో అతడే చైర్మర్గా వ్యవహరిస్తాడని అడ్వైజరీ కమిటీ తెలిపింది.