విశాఖలోని టౌన్ కొత్త రోడ్డు సమీపంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ నూతన ధర్మకర్తల మండలికి పిలుపునిచ్చారు. బుధవారం స్వామి వారి ఆలయానికి కొత్తగా నియమితులైన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు.