అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో పురుషులకు, మహిళలకు సమానంగా ప్రైజ్ మనీని అందజేస్తామని వెల్లడించారు. ఐసీసీ వార్షిక సమావేశం ఇటీవల దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగింది. అందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఐసీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్ చేశారు.