హైబీపీతో బాధపడే వారికి పోషకాహారాన్ని ఇవ్వడం ఎంతో ఉత్తమం. క్రమం తప్పని సమతులాహారం అందించాలి. అలాగే వ్యాయామం, తగినంత నిద్ర కూడా చాలా అవసరం. రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు యోగాసనాలు, ధ్యానం వంటివి చేయాలి. సంగీతం వినడం, మధ్యాహ్నం పూట కాస్త నిద్రపోవడం వంటివి చేస్తే బీపీని తగ్గించుకోవచ్చు. ఉప్పు, నూనె, చక్కెరలు తగ్గిస్తే మంచిది. రోజులో కాసేపైనా నవ్వడం అలవాటు చేసుకోవాలి.