క్యాబేజీని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. క్యాబేజీలో విటమిన్-ఏ, సీ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సీ విటమిన్ వల్ల గుండె జబ్బులు దరిచేరవు. క్యాన్సర్ నిరోధకంగా క్యాబేజీ పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, కండరాల నొప్పులు, అధిక బరువు వంటి సమస్యలను పరిష్కరిస్తుంది.