వర్షాకాలంలో అతిగా పెరుగు తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గొంతునొప్పి, కఫమ్, శ్వాస సమస్య, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పెరుగు ఎక్కువ తినడం వల్ల గురక సమస్య, గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు తెలిపారు. రాత్రిపూట పెరుగు అస్సలు తీసుకోవద్దని, పెరుగు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని, దీని వల్ల జీర్ణ సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.