తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఐదు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం స్వామివారిని 71,894 మంది భక్తులు దర్శించుకోగా.. 25,208 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.