మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే శరీర శ్రేయస్సును పెంచుకుని యవ్వనంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌లు సీ, కే, ఫైబర్, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటాయి. కూరగాయలను ప్రతి రోజు ఆహారంగా తీసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, పిస్తాలను రోజూ తినాలి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, జామున్ వంటి వాటిల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అందాన్ని, చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.