వర్షాకాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడే వండిన ఆహారం, ఫ్రూట్స్ తినిపించాలి. వేడి నీళ్లు తాగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే బట్టలు ధరించాలి. వర్షంలో తడిసి ఇంట్లో వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో కడగాలి. శరీరంపై నీరు లేకుండా టవల్‌తో శరీరాన్ని తూడ్చుకోవాలి.