శ్రీలంక స్టార్ బ్యాటర్ లాహిరు తిరుమన్నె అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 'నేను నా దేశానికి నిబద్ధతతో ఆడా. ఇది చాలా కష్టమైన నిర్ణయం. అనేక కారణాలతో రిటైర్ అవుతున్నా. ఇప్పుడు చెప్పలేను. నా కెరీర్ లో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అంటూ రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమన్నె శ్రీలంక తరపున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 5,543 పరుగులు చేశారు.