దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల స్వల్ప లాభంతో 66,417 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 19,690 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. హిండాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, టాటా మోటార్స్, NTPC కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.