చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఆటలకు పిల్లలను తీసుకురావద్దని నిర్వాహకులు ఆటగాళ్లకు సూచించడంతో పాకిస్థాన్ మహిళా క్రికెటర్, కెప్టెన్ బిస్మా మరూఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. రెండేళ్ల కూతురిని వదిలి వెళ్లడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.