గ్రీస్‌లోని ఎవియా దీవిలో మంగళవారం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీవిలోని క్రిస్టోస్ ప్రాంతంలో గ్రీక్ వైమానిక దళానికి చెందిన వాటర్‌డ్రాపింగ్ విమానం కూలిపోయింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అయితే ఇద్దరు పైలట్లు బతికే అవకాశం లేదని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చెలరేగిన మంటలను ఆర్పుతుండగా ఇది జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa