దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. మిషాలకు సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 66,031 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 19608 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.22 వద్ద ట్రేడవుతోంది. హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.