అధికంగా నీరును తాగడం వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సోడియం లోపం వల్ల నరాల బలహీనత, మెదడు వాపు, ఇంద్రీయాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండ వ్యధి, మధుమేహ సమస్యతో బాధపడేవారు సోడియం లోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజుకు పెద్దవాళ్లు 1.5 నుంచి 2.5 లీటర్ల వరకు నీరు త్రాగవచ్చు. వేడిమి ఎక్కువగా ఉంటే 3 లీటర్ల వరకు నీరు తాగవచ్చు.