దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 289 పాయింట్ల నష్టంతో 66,170 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 19,646 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.38 వద్ద ట్రేడవుతోంది. యూపీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.