వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వర్షాకాలంలో జుట్టు కుదుళ్లకు హాని కలిగించే బ్యాక్టీరియా వాతావరణంలో ఉంటుంది. అందుకే జుట్టు కుదుళ్లను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో జుట్టు ఎక్కువసేపు తడిగా ఉంటే.. జుట్టు రాలడం మొదలవుతుంది. అందువల్ల స్నానం చేసిన తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా దానిలో ఆముదాన్ని కలిపి తలకు రాసి మర్దన చేస్తే మాడుకి రక్త ప్రసరణ అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.