ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీ యాపిల్ సేల్స్ వరుసగా మూడో త్రైమాసికంలోను తగ్గు ముఖం పట్టాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సేల్స్ 1.4 శాతం తగ్గిపోయాయి. ఈ సేల్స్ 20 ఏళ్లలోనే అతి తక్కువగా నమోదు కావడం గమనార్హం. జూన్ మాదిరిగానే సెప్టెంబర్ త్రైమాసికంలోను సేల్స్ తగ్గుతాయని కంపెనీ CFO లూకా మస్ట్రీ తెలిపారు.