మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తదితర కారణాల వల్ల మన దంతాలు బలహీనంగా మారుతాయి. గుట్కా, పాన్‌మసాలా, పొగాకు వల్ల దంతాల వ్యాధి, నోటి వాపు తదితర సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి రావడం, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి రోజు కనీసం రెండు సార్లు బ్రెష్ చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు బ్రెష్ చేసుకోవాలి. అలాగే గుట్కా, పాన్ మసాలా, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.