దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 65,864 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 19,558 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.73 వద్ద కొనసాగుతోంది. జెన్ టెక్నాలజీస్, మోర్ఫెన్ ల్యాబ్స్, వన్ 97 కమ్యూనికేషన్స్, సానోఫీ ఇండియా, అధామ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.