మొలకెత్తిన పెసలు తింటే ఆరోగ్యానికి చాలా మంచింది. కాలేయం, గుండె, కళ్లు, గోళ్లు, వెంట్రుకలు, శరీర ఇతర భాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పని చేస్తాయి. పెసలులో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. మొలకెత్తిన పెసలులో ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అజీర్తి సమస్యను తగ్గించడానికి, ఎముకల ధృడత్వానికి సహాయపడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యను కూడా నివారిస్తుంది.