జీలకర్రతో కాచిన నీటిని తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఈ నీటిని రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జీలకర్ర నీటిని తాగితే శ్వాసకోశ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.జీలకర్ర చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్ర జుట్టు సమస్యలకు కూడా సహాయపడుతుంది.