కారం ఎక్కువగా తింటే నష్టాలుంటాయి. అయితే కారాన్ని సమపాలల్లో తింటే కొన్ని లాభాలున్నాయి. మిరపకాయల్లో విటమిన్ ఎ, సిలు ఉండటం వల్ల అవి యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా తగ్గే అవకాశం ఉంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కూడా కారం బాగా ఉపయోగపడుతుంది. కారం తింటే క్యాలరీలు వేగంగా ఖర్చయ్యి శరీరంలో ఉండే కొవ్వు కరిగే అవకాశం ఉంది.