పుట్టగొడుగులతో కూడిన వంటకాలను చాలా మంది ఇష్టపడతారు. పుష్కలంగా పోషకాలున్న పుట్టగొడుగులను తరచూ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మధుమేహాన్ని అదపు చేస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు తగు మోతాదులో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని సరి చేస్తాయి. చర్మ సమస్యల నుండి రక్షిస్తాయి. ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గే వీలుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి.