భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. 2022, డిసెంబర్ తీసుకున్న శాంపిల్స్‌ను పరీక్షించగా.. ద్యుతీ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలింది. దీంతో ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(NADA) నాలుగేళ్లు నిషేధం విధించింది. ఈ నిషేధం 2023, జనవరి 3 నుంచి వర్తిస్తుందని తెలిపింది. నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు ద్యుతీకి 21 రోజుల సమయం ఉంటుందని వెల్లడించింది.