కళ్యాణదుర్గం పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూల విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అలంకరణ ప్రాకారోత్సవం, కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణోత్సవం చుట్టుపక్కల నుంచి భక్తులు తరలివచ్చి తిలకించారు.