నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, HDFC లైఫ్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, SBI లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్సియల్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, నెస్లే, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.