దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 65,433కి చేరుకుంది. నిఫ్టీ 47 పాయింట్లు పుంజుకుని 19,444 వద్ద స్థిరపడింది. SBI, ICICI బ్యాంక్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, మారుతి కంపెనీల షేర్లు లాభాల్లో పయనించాయి. జియో ఫైనాన్స్, సన్ ఫార్మా, భారతి ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.