హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హీట్స్‌లో పారుల్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రతి హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్లో పాల్గొంటారు. ఫైనల్స్‌ను ఆదివారం నిర్వహించనున్నారు.