అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయానికి 101 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 64,988 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 19,309 వద్ద ట్రేడవుతోంది. ఎస్బీఐ, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.