ఆసియా కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్లు శ్రీలంక చేరుకుంటున్నారు. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులన్నీ లంకలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయం నుంచి శ్రీలంక బయలుదేరిన రోహిత్.. ఈసారి ఆసియా కప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.ఇక వరుసగా ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రధానంగా బీసీసీఐ ప్లేయర్లకు కొత్త రూల్స్ పెట్టింది. ప్రతి క్రీడాకారుడు రోజుకు కనీసం 9 గంటలు నిద్రపోవాలి. ఖాళీ సమయాల్లో వ్యాయామం, వాకింగ్ చేయాలి. తప్పనిసరిగా యోగా సాధన చేయాలి. ప్రతిరోజూ స్విమ్మింగ్ శిక్షణలో నిమగ్నమై ఉండాలి. పిండి పదార్ధాలను తగ్గించి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.