దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 65,066 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 19,328 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, జియోఫిన్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.