దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 66,398 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 19,762 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.14 దగ్గర ప్రారంభమైంది. NTPC, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, టాటా స్టీల్, SBI షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.